WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

రియల్‌మీ  GT5 5G స్మార్ట్‌ఫోన్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 24 జీబీ ర్యామ్ ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 GBతో పనిచేసే రెండు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే ఉన్నాయి.

వాటిలో రియల్‌మీ GT5 ఒకటి.

తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ తొలి సేల్ రికార్డు స్థాయిలో జరిగింది. కేవలం 2 గంటల్లో ఏకంగా 30 వేలకు పైగా ఫోన్లు అమ్ముడుపోవడం విశేషం.

ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ధర రూ. 35,000 అయితే 16GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,500 అయితే 24GB RAM, 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43,000.

ఫీచర్ల విషయానికొస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ 6.74-అంగుళాల 1.5K LED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో అందించబడింది.

కెమెరా విషయానికి వస్తే, ఇది 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఆన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించబడింది. బ్యాటరీ విషయానికొస్తే, ఇది 4600 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 240 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Read This..   WhatsAppలో AI స్టిక్కర్లు