WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

SBI Salary Account Benefits In Telugu : మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా? శాలరీ అకౌంట్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం ఎస్​బీఐ బెస్ట్ శాలరీ ప్యాకేజ్​ అకౌంట్లను అందిస్తోంది.

వాటి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Salary Account Benefits : బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు, వారిని దీర్ఘకాలంపాటు నిలుపుకునేందుకు అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగులు తమ బ్యాంకులో శాలరీ అకౌంట్స్​ ఓపెన్ చేసేలా ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఇందుకోసం ఉద్యోగులకు అనేక ప్రత్యేక సదుపాయాలను, ఇతర బెనిఫిట్స్​ను అందిస్తూ ఉంటాయి. స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా కూడా ఉద్యోగులకు ప్రత్యేక శాలరీ అకౌంట్​లను కల్పిస్తోంది. అంతే కాదు వీటి ద్వారా తమ కస్టమర్లకు చాలా బెనిఫిట్స్​ను, ప్రత్యేక సౌకర్యాలను అందిస్తోంది.

ఎస్​బీఐ శాలరీ ప్యాకేజ్​ అకౌంట్​ అంటే ఏమిటి?

SBI Salary Package Account : ఎస్​బీఐ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ అనేది ఉద్యోగులకు మాత్రమే కల్పిస్తున్న ఒక ప్రత్యేకమైన పొదుపు పథకం. దీని ద్వారా ఉద్యోగులకు ప్రత్యేకమైన బెనిఫిట్స్​, ఫీచర్స్​, సర్వీసెస్​ అందిస్తారు. అలాగే నెట్​బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్​ ఫెసిలిటీ కూడా కల్పిస్తారు. దీని ద్వారా ఉద్యోగులు తమ బ్యాంకింగ్ అవసరాలు తీర్చుకోవడం సహా, సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణ చేసుకోవడానికి వీలవుతుంది.

ఎస్​బీఐ శాలరీ అకౌంట్​ ప్రయోజనాలు ఏమిటి?

  • SBI Salary Package Account Benefits : ఉద్యోగులు తాము ఎంచుకున్న ప్యాకేజీ ఆధారంగా వారికి వచ్చే బెనిఫిట్స్​, ఫీచర్స్​ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని కీలకమైన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
  • జీరో బ్యాలెన్స్ అకౌంట్​ ఓపెన్ చేసుకోవచ్చు.
  • నెలవారీ సగటు బ్యాలెన్స్​ ఛార్జీలు ఉండవు.
  • ఆటో స్వీప్​ సౌకర్యం (ఇది పూర్తిగా ఐచ్ఛికం)
  • ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన ఉచిత డెబిట్​ కార్డ్​
  • డిమాండ్​ డ్రాఫ్ట్​ జారీపై ఛార్జీలు మినహాయింపు
  • ఇండియాలోని అన్ని ఎస్​బీఐ, ఇతర బ్యాంక్​ ATMల్లో అపరిమిత​ లావాదేవీలు జరుపుకునే సౌకర్యం
  • నెలకు 25 చెక్​ లీవ్​ల వరకు మల్టీ సిటీ చెక్​ల జారీపై రుసుము మినహాయింపు
  • ఆల్​లైన్​ RTGS/ NEFT ఛార్జీల మినహాయింపు
  • కాంప్లిమెంటరీ పర్సనల్​/ ఎయిర్​ యాక్సిడెంటల్​ ఇన్సూరెన్స్​
    తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత, గృహ, వాహన రుణాలు అందించడం
  • ఓవర్​ డ్రాఫ్ట్​ సౌకర్యం (అర్హతను అనుసరించి)
  • యాన్యువల్​ లాకర్​ రెంట్​ ఛార్జీలపై రాయితీ (అర్హతను అనుసరించి)
    ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం (అర్హతను అనుసరించి)వెల్త్ రిలేషన్​షిప్​ (అర్హతను అనుసరించి)
Read This..   Gram Sumangal Rural Postal Life Insurance Scheme


ఎస్​బీఐ అందిస్తున్న వివిధ రకాల శాలరీ ప్యాకేజ్​ అకౌంట్స్​

Different Types Of Salary Account Packages Offered by SBI : స్టేట్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా వివిధ రంగాల ఉద్యోగులకు అనుగుణంగా వేర్వేరు శాలరీ ప్యాకేజ్​ ఖాతాలను అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • Central Government Salary Package (CGSP)
  • State Government Salary Package (SGSP)
  • Railway Salary Package (RSP)
  • Defense Salary Package (DSP)
  • Central Armed Police Salary Package (CAPSP)
  • Police Salary Package (PSP)
    Indian Coast Guard Salary Package (ICGSP)
  • Corporate Salary Package (CSP)
  • Start-up Salary Package Account (SUSP)
  • How to open SBI salary account?

SBI శాలరీ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి?

How To Open SBI Salary Account : ఒక వేళ మీరు ఎస్​బీఐ శాలరీ ప్యాకేజ్​ అకౌంట్​ తెరవాలంటే.. నేరుగా బ్యాంకు బ్రాంచ్​కు వెళ్లి సంప్రదించవచ్చు. లేదా ఆన్​లైన్​లో, YONO  యాప్​లో ఈ శాలరీ ప్యాకేజ్​ ఖాతాను తెరవవచ్చు.

ఎస్​బీఐ శాలరీ ఖాతా తెరిచేందుకు కావాల్సిన పత్రాలు
SBI Salary Package Account Opening Documents :

  • Passport size photograph
  • PAN Card copy
  • RBI approved Government Identity Document (Aadhaar, Driving License etc.)
  • Employment/ Service Certificate
    Latest Salary Slip

Note: In case of SBI joint account.. all the applicants have to provide their ID and address documents.

సేవింగ్స్​ అకౌంట్​ను.. శాలరీ అకౌంట్​గా మార్చవచ్చా?

SBI లోని సాధారణ పొదుపు ఖాతాను కచ్చితంగా శాలరీ అకౌంట్​గా మార్చడానికి వీలవుతుంది. దీని కోసం మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఎంప్లాయిమెంట్​ ప్రూఫ్​, శాలరీ స్లిప్​ లేదా సర్వీస్​ సర్టిఫికేట్​ను సమర్పించాల్సి ఉంటుంది.

అకస్మాత్తుగా మీ జీతం ఆగిపోతే!

కొన్ని సార్లు అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో నెలవారీగా శాలరీ అకౌంట్​లో జీతం డబ్బులు జమ కావు. ఇలా వరుసగా మూడు నెలలపాటు జీతం జమకాకపోతే.. అప్పుడు ఆ ఖాతాను ఆటోమేటిక్​గా సాధారణ సేవింగ్స్​ అకౌంట్​గా మార్చేస్తారు. అలాగే అప్పటి వరకు అందిస్తున్న స్పెషల్ ఫీచర్లను కూడా నిలిపివేస్తారు. నిబంధనల ప్రకారం, సాధారణ పొదుపు ఖాతాలపై విధించే రుసుములు కూడా విధిస్తారు.

Read This..   ఒకే ఫోన్.. ఒకే వాట్సాప్.. రెండు ఖాతాలు.. ఒకేసారి వాడొచ్చు.. పూర్తి వివరాలు ఇవి

లాకర్ ఫెసిలిటీ సంగతేంటి?

ఎస్​బీఐ శాలరీ ప్యాకేజ్​ అకౌంట్​ ఉన్నవారికి.. వారి అర్హతను అనుసరించి లాకర్​ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే వార్షిక లాకర్ రెంట్​లో 50 శాతం వరకు కన్సెషన్​ (తగ్గింపు) కూడా లభిస్తుంది!

నెలకు ఎన్ని ఫ్రీ డ్రాఫ్ట్స్​ జారీ చేయవచ్చు!

SBI Over Draft Charges : శాలరీ అకౌంట్​ హోల్డర్స్​.. నెలలో ఎంత మొత్తానికైనా డ్రాఫ్ట్ జారీ చేయవచ్చు. అలాగే ఎన్ని సార్లు అయినా డ్రాఫ్ట్​లు జారీ చేయవచ్చు. వీటిపై ఎలాంటి పరిమితి లేదు. అలాగే వీటిపై ఎలాంటి ఇస్యూయెన్స్​ ఛార్జీలు కూడా విధించరు.

ఏటీఎం లావాదేవీల లిమిట్ ఎంత?

SBI ATM Transactions Charges : ఎస్​బీఐ శాలరీ అకౌంట్​ ఉన్న వాళ్లు భారతదేశంలోని అన్ని ఎస్​బీఐ ఏటీఎంల్లోనూ, ఇతర బ్యాంకు ఏటీఎంల్లోనూ అపరిమితమైన ఆర్థిక లావాదేవీలు జరపుకోవచ్చు. అదీ పూర్తి ఉచితంగా.

NEFT/ RTGS ఛార్జీలు విధిస్తారా?

ఎస్​బీఐ శాలరీ అకౌంట్​ హోల్డర్స్​ ఆన్​లైన్​లో చేసే లావాదేవీలపై ఎలాంటి NEFT/ RTGS