WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

 ఆంధ్రప్రదేశ్ రేసిడెన్షియల్ మైనారిటీ స్కూల్స్ A.P. Residential Minority School ( APRS ) 5,6,7,8 తరగతులలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల . ఎటువంటి ప్రవేశ పరీక్ష లేదు


  •  5వ తరగతిలో 920 సీట్లు ఉన్నాయి
  •  6,7,8 తరగతులలో 1145 సీట్లు ఉన్నాయి

Important Dates

a)ప్రెస్ నోట్ : 04.04.2023
b) దరఖాస్తు ప్రారంభం : 15.05.2023
c) దరఖాస్తుకు చివరి తేదీ : 30.06.2023

అర్హతలు :-

విద్యార్థినీ విద్యార్థులు భారతపౌరులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండవలెను. (b) 5 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 విద్యాసంవత్సరంలో 3వ తరగతి చదివి, 2022-23 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతూ ఉండవలెను. ఓ.సి మరియు బి.సి DSP (O.C B.C) లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు ఎస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి.

 6 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 5 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి…

 7వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి.

 8 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 7 వ తరగతి చదివి ఉండాలి.ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2007 నుండి 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.

Read This..   AP ICET NOTIFICATION 2023

 మైనారిటీ విద్యార్థులు, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును.

ఆదాయపరిమితి:

అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము. (2022 23) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు. అర్హులు.

SC & ST విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు:

a) SC & ST విద్యార్థినీ విద్యార్థులు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేయు విధానం మైనారిటీ విద్యార్థుల కంటే భిన్నంగా ఉంటుంది. వీరు ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష తప్పనిసరిగా వ్రాయవలసి ఉంటుంది.

b) కావున, SC & ST విద్యార్థినీ విద్యార్థులు ప్రవేశము కొరకు వెబ్ సైట్ నందు ఉంచబడిన APRS CAT ప్రాస్పెక్టస్ ని చూడగలరు.

మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు:

a) మైనారిటీ గురుకుల పాఠశాలల్లో చేరాలనుకునే మైనారిటీ అభ్యర్థులు అడ్మిషన్ల కోసం APRS CAT కి హాజరు కానవసరం లేదు.

(b) అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్సైట్ను సందర్శించి, దరఖాస్తును

మరియు ప్రాస్పెక్టస్ను డౌన్లోడ్ చేసుకొనవలెను.

c) అభ్యర్థి ప్రాస్పెక్టస్ ను జాగ్రత్తగా చదవవలెను మరియు అడ్మిషన్ కోసం అర్హత ప్రమాణాల గురించి సంతృప్తి చెందిన తర్వాత, అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ మొదలైన వాటితో అవసరమైన డేటా తో application పూరింపాలి.

d) అప్లికేషన్లో వినియోగములో ఉన్న మొబైల్ నెంబర్ను పేర్కొనవలెను. దరఖాస్తును పూరిస్తున్నప్పుడు, తరగతిని జాగ్రత్తగా ఎంచుకోండి. అభ్యర్థి తరగతిని మార్చుకోవాలనుకుంటే తాజాగా దరఖాస్తు సమర్పించాలి. ఈ సందర్భంలో అతని/ఆమె మునుపటి దరఖాస్తులన్నీ రద్దు చేయబడినట్లు పరిగణించబడతాయి.

1) ఎలాంటి లోపాలు లేకుండా వివరాలను జాగ్రత్తగా పూరించవలెను. ఏదైనా తప్పుడు సమాచారం సమర్పించినట్లయితే, దరఖాస్తు / అడ్మిషన్ తిరస్కరణకు అభ్యర్థి పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుంది.

a) దరఖాస్తు చేయడానికి/ దరఖాస్తును సమర్పించడానికి ఎటువంటి రుసుము లేదు.

b) అభ్యర్థి పూరించిన దరఖాస్తును సంబంధిత పాఠశాల ప్రిన్సిపాలు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా నిర్దిష్ట వ్యవధిలో సమర్పించాలి.

i) దరఖాస్తును సమర్పించేటప్పుడు, దరఖాస్తులో అందించిన సమాచారం. ప్రకారం అవసరమైన ధృవపత్రాలు జతచేయవలెను.

ii) నిబంధనల ప్రకారం ఏదైనా కారణం చేత అతను/ఆమె అనర్హులైతే లేదా అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమైతే అభ్యర్థి యొక్క దరఖాస్తు / అడ్మిషన్ తదుపరి నోటీసు లేకుండా తిరస్కరించబడుతుంది.

Read This..   AP POLYCET 2023 NOTIFICATION