WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

బంగారం ధర మరోసారి తగ్గింది. కాస్త శాంతించినట్లు కనిపించిన బంగారం ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు వినియోగదారులను షాక్‌కు గురి చేశాయి.

10 గ్రాముల బంగారంపై ఒక్క రోజులో రూ. 100 వరకు పెరగడం గమనార్హం.దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61 వేల దిశగా పయనిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా నమోదయ్యాయో ఇప్పుడు చూద్దాం.

చెన్నైలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,600 కాగా 24 క్యారెట్ల ధర రూ. 60,650.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ. 55,300 కాగా 24 క్యారెట్లు రూ.60, 320.

ఢిల్లీలో 22 క్యారెట్లు రూ. 55,450, 24 క్యారెట్ల ధర రూ. 60,470 కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 కాగా 24 క్యారెట్ల ధర రూ. 60,320.

 బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ. 55,300, 24 క్యారెట్ల ధర రూ. 60,320.

 కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 55,300 కాగా 24 క్యారెట్ల ధర రూ. 60,320.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.

 వరంగల్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55300 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,320 కొనసాగుతోంది.

 ఇక ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ. 55,300, 24 క్యారెట్ల ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 55,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,320.

వెండి ధరలు ఎలా ఉన్నాయి?

ఒకవైపు బంగారం ధర భారీగా పెరిగినా వెండి ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ. 700కి తగ్గడం విశేషం.ఇటీవల కాలంలో ఒక్కరోజులో ఇంత తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మంగళవారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,000. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 76,200 కాగా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 80,000.