WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

పది రోజుల్లో రాష్ట్రంలో టీచర్ల బదిలీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఇవాళ మంత్రి బొత్స సమావేశం అయ్యారు.

విజయవాడ: రాష్ట్రంలో పది రోజుల్లో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం మంత్రి సమావేశం అయ్యారు. కొత్త విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వ ఆలోచనను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు వివరించామని తెలిపారు. ప్రభుత్వ ప్రతిపాదనలు ఉపాధ్యాయ సంఘాలు ఆమోదించాయని బొత్స వెల్లడించారు.

యాప్ వల్ల సమయం వృథా అవుతోందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయని.. అయితే దీని ద్వారా పని ఒత్తిడి తగ్గిస్తున్నామని బొత్స తెలిపారు. టీచర్లను బోధనపైనే దృష్టి పెట్టాలని సూచించినట్లు చెప్పారు. డిజిటలైజేషన్ చేసేలా అన్ని జిల్లాల్లో బైజూస్ కంటెంట్ పెడుతున్నామని తెలిపారు. అందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాల మొదలైన 3 రోజుల్లోనే విద్యా కానుక అందిస్తామన్నారు. విద్యా కానుకను ఒకే కిట్గా చేసి స్కూల్ పాయింట్లకు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. పిల్లలకు మెరుగైన విద్య అందించడం కోసం ప్రభుత్వం కొత్త విధానాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ ఏడాది కేవలం 18 రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి లీకేజీ లేకుండా పారదర్శకంగా ఫలితాలు విడుదల చేయబోతున్నమన్నారు.

మంత్రి బొత్సతో సమావేశం అనంతరం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.

“బదిలీలకు సంబంధించి పాత సర్వీసులనే పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు. అవసరమైతే బదిలీ కోడ్ తీసుకొస్తామన్నారు. పాత జీవోను యథాతథంగా అమలు చేస్తామని తెలిపారు. 1,752 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీని చేపడతామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే భర్తీ ప్రక్రియను మొదలు పెడతామని మంత్రి చెప్పారు. జీవో 117 వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. అయితే, బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరిగితే అడ్డుకుంటాం” అని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తెలిపారు.

బదిలీలు మరియు విద్యారంగ సమస్యలపై మంత్రిగారితో సమావేశ చర్చలు సారాంశం
నేటి విద్యా మంత్రి తో ఉపాధ్యాయ సంఘాల సమావేశం పై అందిస్తున్న సమగ్ర సమాచారం.

Read This..   NOC for Visa/Passport Applications SOP

👉దేశంలో 8 రాష్ట్రాలలో Teachers Transfer Act ఉంది.వాటిని అధ్యయనం చేసి The A.P. State Teachers Transfers Regulating Act-2023 Draft Rules తయారు చేసారు.

👉8years Long-standing ప్రతిపాదన వచ్చింది.
మంత్రి మిగిలిన సంఘాల అభిప్రాయం అడిగారు.

👉మున్సిపల్ సర్వీస్ రూల్స్ పై మరింత చర్చ జరిపి ప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తారు.
సంఘాలు ఇచ్చిన 21 ప్రతిపాదనలలో 18 అంగీకారం చేసారు. మిగిలిన వాటిపై చర్చిస్తాం అని తెలిపారు.

👉GO.No.117 కారణంగా 8 Years అవ్వకుండానే బదిలీకి గురయిన వారికి Old Station Points ఇవ్వాలి. ప్రతిపాదన వచ్చింది.

👉2017లో వచ్చిన బదిలీ G.O.37 ఆధారంగా క్రొత్త బదిలీ జీవో తయారు చేయాలని ప్రతిపాదించాము
👉ఎల్ఎఫ్ఎల్ మరియు స్కూల్ అసిస్టెంట్ సబ్జక్ట్ కన్వర్షన్ టీచర్ల విషయంలో మార్పలు చేర్పులకు అవకాశం ఇవ్వాలి.

👉గవర్నమెంట్ బదిలీలను వ్యతిరేకించాం.
👉బదిలీలు ప్రతిపాదిత Transfer Act ద్వారా చేయాలా? Modification GO ద్వారా చేయాలా తర్వాత Clarity ఇస్తామని చెప్పారు.

👉బదిలీల విషయంలో బుధవారం లోపు సంఘాల Grievances

👉 CSE లో ఇవ్వాలని మంత్రిగారు చెప్పారు.
ప్లస్ టు కు సంబంధించి ప్రతి మండలానికి కనీసం ఒక స్కూలు ఉండేలా 292 schools ఎంపిక చేసి వాటికి మంజూరైన 1752 పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు

👉స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో నే విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు MDM, బైజూస్ content చేసేలా చర్యలు

👉IMMS app లో భోజన సమయంలో ఫోటోలు తీయకుండా కేవలం భోజనం తినే వారి సంఖ్య మాత్రమే పోస్ట్ చేసేలా చర్యలు👉IMMS యాప్ లో టాయిలెట్స్ ఫోటోలు రోజు తీయకుండా రాండముగా అప్పుడప్పుడు తీసేలా చర్యలు

👉JVK kits పాఠశాల ప్రారంభమైన మూడు వారాలు లోపే యాప్ లో ఐటమ్ వారీగా కాకుండా టోటల్ మొత్తం కిట్ చేసేలా చర్యలు

👉JVK kit లోని బ్యాగ్ నాణ్యత సరిగా లేకపోతే నెలలోపే రీప్లేస్మెంట్ చేసేలా చర్యలు
👉బోధనకు ఆటంకం లేకుండా అన్ని అంశాలు యాప్లలోని అన్ని అంశాలు మినీ మైస్ చేసి తొమ్మిదిన్నరలోపు (9.30am) యాప్ లో పోస్ట్ చేసేలా చర్యలు

👉పాఠశాలలకు సంబంధించిన కరెంటు బిల్లులు నిధులు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే చెల్లించాలి మిగిలినవి ప్రధానోపాధ్యాయులు చెల్లించవలసిన అవసరం లేదు కరెంటు కట్ చేయరు.

👉పురపాలక నగరపాలక ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ను AP Mpl Edn unified service rules పరిగణిస్తూ పాత రూల్స్ రద్దు చేస్తూ నూతన డ్రాప్ రూల్స్ రూల్స్ ఇస్తారు

Read This..   D.El.Ed 1st Semester Jan-2023 - Time Table

👉ఉపాధ్యాయుల సర్వీస్ పరమైన అంశాలన్నీ పాత జిల్లా స్థాయిలోనే అనగా 13 జిల్లాల స్థాయిలోనే జరుగుతాయి

👉ఎంఈఓ పోస్టులను సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేశాక ఇస్తారు

👉30: 70 నిష్పత్తిలో పదోన్నతులు ఉంటాయి

👉LFL పోస్టులన్నీ ఎస్జీటీల తో నే భర్తీ చేస్తారు

👉పదోన్నతులకు థర్డ్ మేడాలజీ వారికి అవకాశం కల్పిస్తారు

👉పురపాలక నగరపాలక వారి వారిని జిల్లా యూనిట్ గా తీసుకుంటారు

👉High School Plus లలో Qualified school assistants కు ఒక ఇంక్రిమెంట్ తో 1752 పోస్టులకు ప్రమోషన్స్ ఇస్తారు . స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అందులో అర్హత సాధించాలి

👉June నాటికి apps బారం తగ్గిస్తాం

👉Teachers కి ట్రైనింగ్ సమ్మర్ లోనే జరుపుతామని చెప్పారు

👉ఉన్న apps ను వీలైనంత వరకు తగ్గించి ఒకే స్క్రీన్ లోకి తీసుకువస్తాం..పని బారం తగ్గుతుంది

👉Teachers attendence యదావిధిగా ఉంటుంది

👉చిక్కి, ఎగ్, రాగిజావ ఎంత మంది తీసుకుంటారు అనేది ఒకసారి complete అవుతుంది.teachers కి,HM కి ఇన్స్పెక్షన్ తీసివేసి గ్రామ సచివాలయంవారికి ఇస్తారు.

👉IMMS యాప్ లో ఇండెంట్ మాత్రమే ఉంటుంది.

👉ఇన్స్పెక్షన్ పార్ట్ HM లకు ఉండదు. అనగా ఫొటోస్ తీసే పని ఉండదు. టాయిలెట్ ఫోటో ఒకటి తీస్తే చాలు.

👉JVK యాప్ లో parts వారీగా కాకుండా kit wise enter చేస్తే చాలు. Replacement కు మాత్రం అవకాశం ఉంటుంది.

👉STMS(నాడు నేడు) యాప్ అలాగే ఉంటుంది.

👉మిగిలినవి ward/Village సెకరటేరియట్ సిబ్బంది చూసుకుంటారు.

👉కొత్తగా నియమించ బడ్డ ఉపాధ్యాయులకు ఈ వేసవి సెలవుల్లో Teacher trainings ఉంటాయి.

👉JVK kits School point కే చేర్చుతారు.

👉పాఠశాలల విద్యుత్ బిల్లులు ఫండ్ ఉన్నత వరకు Pay చేయాలి,ఫండ్ లేకపోతే కట్టనవసరం లేదు.బకాయి గా చూపుతారు.బిల్లు పెండింగ్ ఉన్నప్పటికి ఫవర్ కట్ చేయరు.

👉స్కూల్ బ్యాగ్స్, 👟 ఒకవేళ Poor quality ఉంటే JVK APP లో drop in box పెడతారు తద్వారా replace చేస్తారట.

👉అకడమిక్ మానిటరింగ్ లో 9:30 am టికెట్స్ రైస్ చేస్తారు టీచింగ్ కు ఆటంకం లేకుండా చూస్తారట

👉STMS యాప్ ను కేవలం నాడు నేడు స్కూల్స్ కు మాత్రమే పరిమితం చేస్తారు.