జూలై నెలలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. వాగులు, వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయి. ఆగస్టు నెలలో వర్షాల జాడ లేదు. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజులు (ఆగస్టు 20, 21) వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
వారం రోజుల్లో వర్షాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. కొంతకాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోనూ చిరు జల్లులు పడ్డాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమురం భీం తదితర జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీరం వెంబడి 30 నుంచి 40 కి.మీ. మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది